• facebook
  • whatsapp
  • telegram

క్లాట్‌కు 86.20 శాతం హాజరు

* అక్టోబరు 5న ఫలితాల వెల్లడి
ఈనాడు, హైదరాబాద్‌: దేశంలోని 22 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు సెప్టెంబ‌రు 28న‌ నిర్వహించిన కామన్‌ లా అడ్మిషన్‌ టెస్టు(క్లాట్‌-2020)కు 86.20 శాతం మంది హాజరయ్యారు. మొత్తం 75,183 మంది దరఖాస్తు చేయగా వారిలో 68,833 మంది పరీక్ష రాసినట్లు నల్సార్‌ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఫైజన్‌ ముస్తాఫా తెలిపారు. లక్షద్వీప్‌లోని కవరత్తిలో ఒక విద్యార్థి దరఖాస్తు చేసుకోగా పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. ఆ విద్యార్థి కూడా పరీక్ష రాయకపోవడం విశేషం. ఈసారి ప్రశ్నల సంఖ్యను 200 నుంచి 150కి తగ్గించారు. ఫలితాలు అక్టోబరు 5న వెల్లడిస్తారు. ప్రవేశాల ప్రక్రియ అక్టోబరు14వ తేదీతో పూర్తవుతుంది.

Posted Date : 29-09-2020 .