• facebook
  • whatsapp
  • telegram

ఐసెట్‌ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

ఎన్జీవోస్‌ కాలనీ, న్యూస్‌టుడే: ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్‌ ఐసెట్‌కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఐసెట్‌ కన్వీనర్‌ ఆచార్య కె.రాజిరెడ్డి సెప్టెంబ‌రు 28న‌ తెలిపారు. ఈ పరీక్షకు తెలుగు రాష్ట్రాల నుంచి 58,452 మంది దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలో హైదరాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, కోదాడ, మహబూబ్‌నగర్‌, నల్గొండ, నిజామాబాద్‌, సిద్దిపేట, వరంగల్‌, ఏపీలోవిజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, తిరుపతి కేంద్రాల్లో రీజినల్‌ కేంద్రాలను నెలకొల్పినట్లు తెలిపారు. సెప్టెంబ‌రు 30న ఉదయం 9.30 గంటల నుంచి 12 వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటల వరకు, అక్టోబరు 1న ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఒక్క నిమిషం ఆలస్యం అయిన అనుమతించేది లేదన్నారు. విద్యార్థులు హాల్‌టికెట్‌, ఆధార్‌ గుర్తింపుకార్డు తెచ్చుకోవాలని స్పష్టం చేశారు. మాస్కు ధరించాలని, శానిటైజర్‌, నీళ్ల సీసా వెంట తెచ్చుకోవాలని సూచించారు. ప్రాథమిక ‘కీ’ని అక్టోబరు 7న విడుదల చేస్తామని కన్వీనర్‌ తెలిపారు.

Posted Date : 29-09-2020 .