• facebook
  • whatsapp
  • telegram

8,960 మందికి ఈసెట్‌ సీట్ల కేటాయింపు

ఈనాడు, హైదరాబాద్‌: ఈసెట్‌ కౌన్సెలింగ్‌ మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తయింది. మొత్తం 17,529 మంది వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోగా రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌, ఫార్మసీ కళాశాలల్లో రెండో ఏడాదిలో 10,418 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వారిలో 8,960 మంది సీట్లు దక్కించుకున్నారు. సీట్లు పొందిన వారు అక్టోబరు 3వ తేదీ లోపు ట్యూషన్‌ రుసుం చెల్లించి సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని ప్రవేశాల కన్వీనర్‌ నవీన్‌ మిత్తల్‌ తెలిపారు. చివరి దశ కౌన్సెలింగ్‌ అక్టోబరు 9 నుంచి 12వ తేదీ వరకు జరుగుతుంది.

Posted Date : 29-09-2020 .