• facebook
  • whatsapp
  • telegram

ఉన్నత విద్యాసంస్థల్లో సెలవులన్నీ రద్దు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో అక్టోబరు 15వ తేదీ నుంచి ఉన్నత విద్యా సంస్థలను పునఃప్రారంభించాలని భావిస్తున్నందున పాటించాల్సిన ప్రామాణిక నిర్వహణ పద్ధతులను ఉన్నత విద్యామండలి సిద్ధం చేసింది. వీటిని విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు పంపించనుంది.
* ఈ తరగతులు వచ్చే ఏడాది ఆగస్టు 21వ తేదీ వరకు జరగనున్నాయి. విద్యార్థులకు ఎలాంటి సెలవులు ఉండవు. ఆదివారం మాత్రమే విరామం ఉంటుంది. పండగలు, వేసవి సెలవులను రద్దు చేయనున్నారు.
* సగం మంది విద్యార్థులకు నేరుగా తరగతులు, మిగతా వారికి ఆన్‌లైన్‌లో బోధన చేయాలి. దీన్ని వంతుల వారీగా నిర్వహించాలి.

Posted Date : 30-09-2020 .