‘సూపర్‌ 30’ సాయంతో ఐఐటీ శిక్షణ

ఈనాడు, దిల్లీ: ఐఐటీ ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే ఎస్సీ, ఓబీసీ విద్యార్థులకు పట్నాలోని ‘సూపర్‌ 30’ కోచింగ్‌ కేంద్రం ద్వారా శిక్షణ ఇప్పించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ, ‘సూపర్‌ 30’ వ్యవస్థాపకుడు ఆనంద్‌ కుమార్‌ ఓ అవగాహనకు రానున్నారు. దేశంలోని రెండు వేల మంది ఎస్సీ, ఓబీసీ విద్యార్థులకు ఆన్‌లైన్‌ ద్వారా ఉచితంగా శిక్షణ ఇప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కోచింగ్‌కు ఎంపికైన విద్యార్థులకు లాప్‌టాప్‌/ట్యాబ్‌లు ఇవ్వనున్నారు.

Posted Date : 01-10-2020 .