• facebook
  • whatsapp
  • telegram

9, 10 తరగతుల విద్యార్థులకే ‘బీఏఎస్‌’ వర్తింపు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎస్సీ, ఎస్టీ నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్య అందించేందుకు ఉద్దేశించిన బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ (బీఏఎస్‌) పథకాన్ని 2 నుంచి 8 తరగతులు చదివే విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరానికి కొనసాగించబోమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2020-21లో కేవలం 9, 10 తరగతుల విద్యార్థుల్నే ఈ పథకం కింద కొనసాగిస్తామని పేర్కొంది. ఈ మేరకు సాంఘిక సంక్షేమశాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. 2 నుంచి 8 తరగతుల విద్యార్థుల్ని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, వసతి గృహాల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించింది. ప్రస్తుతం బీఏఎస్‌ కింద 32 వేల మంది 2 నుంచి 8 తరగతులు చదువుతున్నారు. బీఏఎస్‌ పథకాన్ని గత ప్రభుత్వం ప్రారంభించింది. ఆయా వర్గాల విద్యార్థులు ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో చదివేందుకు ప్రభుత్వం 1 నుంచి 10 తరగతుల వరకూ ఆర్థిక సాయం అందిస్తుంది.

Posted Date : 01-10-2020 .