• facebook
  • whatsapp
  • telegram

టీఎస్‌ఐసెట్‌ ప్రారంభం

కేయూ క్యాంపస్‌, న్యూస్‌టుడే: ఎంబీఏ, ఎంసీఏ విభాగాల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న టీఎస్‌ఐసెట్‌-2020 సెప్టెంబరు 30న ప్రారంభమైంది. ఈ ఏడాది కాకతీయ విశ్వవిద్యాలయం ఆన్‌లైన్‌ ద్వారా ప్రవేశపరీక్ష నిర్వహిస్తోంది. సెప్టెంబరు 30, అక్టోబరు 1న మూడు విడతలుగా పరీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య టి.పాపిరెడ్డి కేయూ సెనెట్‌ హాలులో ప్రశ్నపత్రాన్ని విడుదల చేశారు. తొలిరోజు ఉదయం పరీక్షకు 18,701 మంది విద్యార్థులకు గాను 14,438 (77 శాతం) మంది, మధ్యాహ్నం 20,081 మందికి గాను 15,850 (79 శాతం) మంది హాజరయ్యారని ఐసెట్‌ కన్వీనర్‌ ఆచార్య కె.రాజిరెడ్డి తెలిపారు. వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య కె.పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

Posted Date : 01-10-2020 .