• facebook
  • whatsapp
  • telegram

బహుళ ఐచ్ఛిక విధానంలో ఎఫ్‌ఏ పరీక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఏ) పరీక్షలను బహుళ ఐచ్ఛిక విధానంలో నిర్వహించాలని విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. ఏటా 1 నుంచి 10 తరగతుల విద్యార్థులకు నాలుగు ఎఫ్‌ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈసారి వ్యాసరూప ప్రశ్నలతో పరీక్షలు కుదరకపోవచ్చని భావిస్తున్న విద్యాశాఖ, తొలుత బహుళ ఐచ్ఛిక (ఆబ్జెక్టివ్‌) విధానంలో ప్రశ్నపత్రం ఇచ్చి పరీక్షలు జరపనుంది. సిలబస్‌ తగ్గింపుపైనా పాఠశాల విద్యాశాఖ అధికారులు చర్చించారు. పాఠ్యాంశాలను పూర్తిగా తీసివేయకుండా అసైన్‌మెంట్లు/ప్రాజెక్టులు ఇచ్చి, కొన్ని మార్కులు కేటాయించాలని భావిస్తున్నట్లు సమాచారం.
పాఠశాలలు తెరిచేది ఈ నెలలో కాదు!
అక్టోబరు 15 తర్వాత పాఠశాలలను తెరవవచ్చని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాల్లో పేర్కొంది. అయితే రాష్ట్రంలో పాఠశాలలకు అక్టోబరులో అనుమతి ఇవ్వరాదని ప్రభుత్వం భావిస్తోంది.

Posted Date : 01-10-2020 .