• facebook
  • whatsapp
  • telegram

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 341 మార్కులు!

* తెలుగు రాష్ట్రాల్లో ఇవే అత్యధికం

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సెప్టెంబరు 27న జరిగిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక మార్కులు 341ను విజయవాడలోని ఓ కార్పొరేట్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థి సాధించినట్లు సమాచారం. అతను జేఈఈ మెయిన్స్‌లో 100లోపు ర్యాంకు పొందారు. ఐఐటీ దిల్లీ అధికారులు విడుదల చేసిన ప్రాథమిక కీ ప్రకారం ఆ విద్యార్థికి 341 మార్కులు వస్తాయని శిక్షణ ఇచ్చిన నిపుణులు తేల్చారు. దిల్లీకి చెందిన ఓ విద్యార్థి 348 సాధించినట్లు తెలిసింది. తెలుగు రాష్ట్రాల్లోని మరో కార్పొరేట్‌ కళాశాల విద్యార్థికి 330 మార్కులు వచ్చినట్లు సమాచారం. దీని ప్రకారం ఈసారి ఏపీ, తెలంగాణ నుంచి మొదటి 10 ర్యాంకుల్లో ఇద్దరు ఉండొచ్చని శిక్షణ సంస్థల అంచనా. అక్టోబరు 5న ఐఐటీ దిల్లీ అధికారికంగా ర్యాంకులు వెల్లడించనుంది.

Posted Date : 01-10-2020 .