• facebook
  • whatsapp
  • telegram

ప్రశాంతంగా ఏపీ లాసెట్‌

ఎస్‌.కె.విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో 62 కేంద్రాల్లో అక్టోబ‌రు 1న‌ నిర్వహించిన ఏపీలాసెట్‌, పీజీఎల్‌సెట్‌-2020 ప్రశాంతంగా సాగింది. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు 12,281 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. మొత్తం 18,371 మంది దరఖాస్తు చేసుకోగా 66.85 శాతం మంది హాజరైనట్లు పరీక్ష కన్వీనరు జ్యోతి విజయ్‌కుమార్‌ తెలిపారు.

Posted Date : 02-10-2020 .