• facebook
  • whatsapp
  • telegram

7న ఐసెట్‌-2020 ‘కీ’ విడుదల

కేయూ క్యాంపస్‌, న్యూస్‌టుడే: ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్‌ ఐసెట్‌-2020 ‘కీ’ ని అక్టోబ‌రు  7న విడుదల చేయనున్నట్లు కన్వీనర్‌ ఆచార్య కె.రాజిరెడ్డి తెలిపారు. అభ్యంతరాలను పదో తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తామన్నారు. అక్టోబ‌రు 23న ఫలితాలను ప్రకటించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రెండు రోజులపాటు నిర్వహించిన టీఎస్‌ ఐసెట్‌-2020 ప్రశాంతంగా ముగిసిందని, రెండో రోజైన అక్టోబ‌రు 1న‌ జరిగిన పరీక్షకు రెండు రాష్ట్రాల్లో 19,610 మంది విద్యార్థులకు 15,687 మంది (80 శాతం) హాజరైనట్లు రాజిరెడ్డి తెలిపారు.

Posted Date : 02-10-2020 .