• facebook
  • whatsapp
  • telegram

టీఎస్‌ లాసెట్‌ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: టీఎస్‌ లాసెట్‌, పీజీఎల్‌సెట్‌-2020కు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. విద్యార్థులు https://lawcet.tsche.ac.in/ద్వారా వాటిని పొందవచ్చని టీఎస్‌ లాసెట్‌ కన్వీనర్‌ ప్రొ.జీబీ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబ‌రు 9న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య టీఎస్‌ లాసెట్‌ (మూడేళ్ల), మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల మధ్య టీఎస్‌ లాసెట్‌ (ఐదేళ్ల), పీజీఎల్‌సెట్‌ జరగనుంది. వీటికి 30,310 మంది దరఖాస్తు చేసుకోగా తెలంగాణ, ఏపీలో కలిపి 67 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
టీఎస్‌ ఎడ్‌సెట్‌ హాల్‌టికెట్లు సైతం...
అక్టోబ‌రు 3న జరగనున్న టీఎస్‌ ఎడ్‌సెట్‌-2020 హాల్‌టికెట్లను https://edcet.tsche.ac.inనుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కన్వీనర్‌ ప్రొ.టి.మృణాళిని ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 45 పరీక్ష కేంద్రాలలో గణితం, ఫిజికల్‌ సైన్స్‌, బయోలాజికల్‌ సైన్స్‌, ఆంగ్లం, ఓరియంటల్‌ లాంగ్వేజెస్‌ సబ్జెక్టులకు పరీక్ష జరగనుంది. ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు 90 నిమిషాలు ముందుగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. మరోవైపు టీఎస్‌ ఎడ్‌సెట్‌ సోషల్‌ స్టడీస్‌ పరీక్ష అక్టోబ‌రు 1న‌ నిర్వహించగా 69.9 శాతం మంది హాజరయ్యారు.

 

 

 

Posted Date : 02-10-2020 .