• facebook
  • whatsapp
  • telegram

రెండు దశల్లో ఎంబీబీఎస్‌ తరగతుల ప్రారంభం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న 16 నూతన వైద్య కళాశాలల్లో.. ఎంబీబీఎస్‌ తరగతులు రెండు దశల్లో ప్రారంభం కానున్నాయి. పాడేరు, పిడుగురాళ్ల, మచిలీపట్నం, పులివెందుల, ఏలూరు, విజయనగరం, రాజమండ్రి, నంద్యాల, అనకాపల్లి, మదనపల్లి వైద్య కళాశాలల్లో 2022 - 23 విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. అనుమతి కోసం 2021-22 విద్యా సంవత్సరంలో జాతీయ వైద్య మిషన్‌కు దరఖాస్తు చేస్తారు. బాపట్ల, మార్కాపురం, అమలాపురం, నరసాపురం, ఆదోని, పెనుకొండ వైద్య కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. తరగతుల నిర్వహణ అనుమతి కోసం 2022-23 విద్యా సంవత్సరంలో దరఖాస్తు చేస్తారు. తరగతుల నిర్వహణకు తగ్గట్లుగా వైద్యకళాశాలల్లో భవన నిర్మాణాలు, వైద్యుల నియామకాలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది.

Posted Date : 03-10-2020 .