• facebook
  • whatsapp
  • telegram

31వరకు ఇంటివద్దనే 1-8 తరగతుల విద్యార్థులు

* 9-12 విద్యార్థులకు అనుమతి

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో 1-8 తరగతుల విద్యార్థులకు అక్టోబరు 31 వరకు ఆన్‌లైన్‌ తరగతులే నిర్వహించనున్నట్లు అక్టోబరు 2న విడుదల చేసిన అన్‌లాక్‌- 5.0 మార్గదర్శకాల్లో పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. అక్టోబరు 15 నుంచి పాఠశాలలను తెరవడంపై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రం రాష్ట్రాలకు అప్పగించిన నేపథ్యంలో ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. విద్యాశాఖ ఆదేశాల ప్రకారం నవంబరులోనే పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. 1-8 తరగతుల పిల్లల్ని పాఠశాలలకు పిలిపించకూడదని, ఇంటినుంచే ఆన్‌లైన్‌ అభ్యాసన, బోధన నిర్వహించాలని సూచించింది. కంటెయిన్‌మెంట్‌ జోన్‌కు వెలుపల ఉన్న 9-12 విద్యార్థులు ఉపాధ్యాయుల మార్గదర్శకం కోసం పాఠశాలలకు వెళ్లొచ్చని సూచించింది. వీరికి అక్టోబరు 15 వరకు రోజువారీగా ఆన్‌లైన్‌లో విధానంలో నిర్వహించాల్సిన అంశాలను వెల్లడించింది.

Posted Date : 03-10-2020 .