• facebook
  • whatsapp
  • telegram

ట్రిపుల్‌ఐటీ విద్యార్థులకు 12 నుంచి వార్షిక పరీక్షలు

వేంపల్లె, న్యూస్‌టుడే: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జేయూకేటీ) పరిధిలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీల్లో చదువుతున్న ఇంజినీరింగ్‌  చివరి  సంవత్సరం విద్యార్థులకు అక్టోబ‌రు 12 నుంచి 16 వరకు వార్షిక పరీక్షలు  నిర్వహించనున్నట్లు  అధికారులు తెలిపారు. షెడ్యూల్‌ను ప్రకటించారు. ఇడుపులపాయ,  నూజివీడు  ట్రిపుల్‌ఐటీల్లో ఇంజినీరింగ్‌  చివరి  సంవత్సరం చదివే విద్యార్థులు 2 వేల మంది ఉన్నారు. వారికి అక్టోబ‌రు 12 నుంచి 16 వరకు విద్యార్థులు తమ ఇళ్ల వద్ద నుంచే ఆన్‌లైన్‌ ద్వారా పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు చేశారు.

Posted Date : 10-04-2020 .