• facebook
  • whatsapp
  • telegram

36,600 మందికి తప్పిన డి‘టెన్షన్‌’!

* అందరూ ప్రమోట్‌ 
* ఓయూ, జేఎన్‌టీయూ నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ నేపథ్యంలో 2020-21 విద్యా సంవత్సరానికి క్రెడిట్స్‌ ఆధారంగా డిటెన్షన్‌ లేకుండా రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. ఓయూ, జేఎన్‌టీయూ పరిధిలో యూజీ, ఇంజినీరింగ్‌ కోర్సులు చదువుతున్న విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేశారు. మరుసటి ఏడాది సెమిస్టర్‌ తరగతులకు ఆన్‌లైన్‌లో హాజరయ్యే అవకాశం కల్పించారు. తద్వారా రెండు వర్సిటీల పరిధిలో కలిపి 36,600 మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. అయితే సెమిస్టర్‌ పరీక్షలు మాత్రం రాసి ఉత్తీర్ణులు కావాల్సిందే. ఒకవేళ అనుత్తీర్ణత సాధిస్తే వచ్చే ఏడాదికి బ్యాక్‌లాగ్స్‌ మిగిలి ఉంటాయి. డిటెన్షన్‌ మాత్రం వర్తించదు. మిగిలిపోయిన సబ్జెక్టులను మరుసటి ఏడాదిలోగా పూర్తి చేస్తేనే, ఆపై తరగతికి ప్రమోట్‌ చేసే వీలుంటుందని అధికారులు వివరించారు. తాజా నిర్ణయంతో ఓయూ పరిధిలో.. యూజీ కోర్సులు చదువుతున్న మొదటి ఏడాది విద్యార్థులు 16 వేల మంది, రెండో ఏడాదిలో 15 వేల మంది ప్రమోట్‌ అయ్యారు. ఇంజినీరింగ్‌లో మరో 600 మంది వరకు విద్యార్థులు ఉన్నారు. జేఎన్టీయూలో రెండో ఏడాదికి వెళ్లే 3 వేల మంది.. మిగిలిన సంవత్సరాలకు చెందిన మరో 2 వేల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు.
 

Posted Date : 10-04-2020 .