• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ అటవీ కళాశాల విద్యార్థుల ప్రతిభ

ఈనాడు, హైదరాబాద్‌: బెనారస్‌ హిందూ యూనివర్సిటీ ఎంఎస్సీ ఆగ్రోఫారెస్ట్‌ కోర్సు ప్రవేశ పరీక్షలో గజ్వేల్‌ నియోజకవర్గం ములుగులోని తెలంగాణ అటవీ కళాశాల, పరిశోధన సంస్థ (ఎఫ్‌సీఆర్‌) విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 23 సీట్లు ఉండే ఈ కోర్సుకు సంబంధించి జాతీయస్థాయి ప్రవేశపరీక్షలో కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు ర్యాంకులు సాధించారు. బి.వెంకటేశ్వర్‌రెడ్డి (నారాయణపేట జిల్లా) మొదటి ర్యాంకు సాధించారు. ఆయనతో పాటు పురుమాండ్ల వెన్నెల (సిద్దిపేట జిల్లా), కాలె ఇందు (రంగారెడ్డి జిల్లా), యెరువ తేజశ్రీ (భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా) కూడా బెనారస్‌ వర్సిటీలో సీట్లు సాధించారు. వీరిని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అభినందించారు.

Posted Date : 10-04-2020 .