• facebook
  • whatsapp
  • telegram

క్లాట్‌లో నాలుగు ప్రశ్నల తొలగింపు

ఈనాడు, హైదరాబాద్‌: నిపుణుల కమిటీ సిఫారసు మేరకు కామన్‌ అడ్మిషన్‌ లా టెస్టు(క్లాట్‌)లో మొత్తం నాలుగు ప్రశ్నలను తొలగించినట్లు నల్సార్‌ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఫైజన్‌ ముస్తఫా ఒక ప్రకటనలో తెలిపారు. అందులో యూజీ ప్రశ్నపత్రంలో మూడు, పీజీలో ఒక ప్రశ్న తొలగించారు. అంతేకాకుండా యూజీలో ‘కీ’లోని నాలుగు ప్రశ్నలకు సమాధానాలు మార్చినట్లు తెలిపారు. ఆంగ్లం, వర్తమాన వ్యవహారాల్లో ఒకటి చొప్పున, క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌లో రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు మార్చారు.

Posted Date : 10-04-2020 .