• facebook
  • whatsapp
  • telegram

కరోనాతో ఎంసెట్‌ రాయకుంటే దరఖాస్తు చేసుకోండి

ఈనాడు, హైదరాబాద్‌: సెప్టెంబ‌రులో జరిగిన ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షలకు కరోనా కారణంగా హాజరుకాలేని వారు అక్టోబ‌రు 5వ తేదీలోపు తగిన ఆధారాలను పంపించి దరఖాస్తు చేసుకోవాలని ఎంసెట్‌ కన్వీనర్‌ గోవర్ధన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 17 నుంచి సెప్టెంబరు 14ల మధ్య కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి మళ్లీ పరీక్ష జరుపుతామని పేర్కొన్నారు. ఎంసెట్‌ వెబ్‌సైట్‌లోని అండర్‌టేకింగ్‌ ఫామ్‌ కొవిడ్‌-19 పాజిటివ్‌ క్యాండిడేట్స్‌ అనే పత్రాన్ని పూర్తి చేసి పాజిటివ్‌, నెగెటివ్‌ రిపోర్ట్‌, హాల్‌ టికెట్‌ను అక్టోబ‌రు 5వ తేదీ అర్ధరాత్రి లోపు మెయిల్‌కు పంపించాలని ఆయన సూచించారు. అభ్యర్థులు  convenertseamcet2020@jntuh.ac.in, convenertseamcet2020@jntuh.ac.in అనే మెయిళ్లకు పంపించవచ్చు. పరీక్ష తేదీ, సమయం, పరీక్షా కేంద్రం వివరాలను త్వరలో వెల్లడిస్తామని ఆయన తెలిపారు.

Posted Date : 10-04-2020 .