• facebook
  • whatsapp
  • telegram

కేఎల్‌ డీమ్డ్‌ యూనివర్సిటీలో ఆన్‌లైన్‌ దూరవిద్య కోర్సులు

విజయవాడ, న్యూస్‌టుడే: కేఎల్‌ డీమ్డ్‌ యూనివర్సిటీలో ఆన్‌లైన్‌ దూరవిద్య కోర్సులను ప్రారంభిస్తున్నట్లు ఆ వర్సిటీ ఉప కులపతి ఎల్‌.ఎస్‌.ఎస్‌.రెడ్డి తెలిపారు. యూజీసీ తమ సంస్థకు నాక్‌ ఏ ప్లస్‌ ప్లస్‌, యూజీసీ కేటగిరీ 1 హోదా, జాతీయ స్థాయిలో 100 లోపు ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకు ఇవ్వడంతో దూర విద్య కోర్సులను ప్రారంభించే అర్హత లభించిందని చెప్పారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా దూర విద్య విధానంలో డిజిటల్‌ కంటెంట్‌ ఇవ్వడం, ఆన్‌లైన్‌ పద్ధతిలో తరగతులు నిర్వహించడంతో విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. డిగ్రీ కోర్సుల్లో బీబీఏ, బీసీఏ, బీఎస్సీ, బీకాం, బీఏ కోర్సులు.. పీజీ కోర్సుల్లో ఎమ్మెస్సీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ కోర్సులను అందిస్తున్నట్లు తెలిపారు. అక్టోబరు 8 నుంచి https://www.kluniversity.in/odl.aspx ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

Posted Date : 10-04-2020 .