• facebook
  • whatsapp
  • telegram

10,202 పాలిటెక్నిక్‌ సీట్ల ఖాళీ

ఈనాడు, హైద‌రాబాద్‌: పాలిసెట్‌ చివరి విడత సీట్లను అక్టోబ‌రు 1న‌ కేటాయించగా.. రాష్ట్రంలో ఇంకా 10,202 పాలిటెక్నిక్‌ సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి. ప్రభుత్వ కళాశాలల్లో 616, ఎయిడెడ్‌లో 30, ప్రైవేట్‌లో 9,556 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 132 కళాశాలల్లో 31,792 సీట్లుండగా 21,590 సీట్లను విద్యార్థులకు కేటాయించారు. సీట్లు పొందిన వారు అక్టోబ‌రు 6లోపు ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది. అక్టోబ‌రు 7న విద్యా సంవత్సరం మొదలవుతుంది. 14 వరకు ఓరియంటేషన్‌ తరగతులను నిర్వహిస్తారు. 15 నుంచి పూర్తిస్థాయిలో తరగతులు ప్రారంభమవుతాయి.

Posted Date : 04-10-2020 .