• facebook
  • whatsapp
  • telegram

అక్టోబ‌రు 5న‌ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో ఉన్న ఐఐటీల్లో బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశానికి సెప్టెంబ‌రు 27న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు అక్టోబ‌రు 5న ఉదయం 10 గంటలకు వెల్లడికానున్నాయి. పరీక్ష నిర్వహణ బాధ్యతలు తీసుకున్న ఐఐటీ దిల్లీ అధికారులు ఫలితాల విడుదలకు ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా దాదాపు 1.45 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారు. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశానికి అక్టోబ‌రు 6వ తేదీ నుంచి ఉమ్మడి కౌన్సెలింగ్‌ను జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ(జోసా) నిర్వహించనుంది.

Posted Date : 04-10-2020 .