• facebook
  • whatsapp
  • telegram

వ్యవసాయ పరిజ్ఞానానికి ‘పరీక్ష’

* ప్రిలిమ్స్‌లో ఎక్కువ ప్రశ్నలు వాటిపైనే

ఈనాడు డిజిటల్‌, అమరావతి: దేశవ్యాప్తంగా వ్యవసాయ సంస్కరణలపై చర్చ జరుగుతున్న తరుణంలో.. సివిల్స్‌ ప్రాథమిక పరీక్షలో ఈ అంశంపైనే ఎక్కువ ప్రశ్నలు ఇచ్చారు. దేశవ్యాప్తంగా సివిల్స్‌ ప్రాథమిక పరీక్ష అక్టోబరు 4న జరిగింది. సాగు విధానం, పర్యావరణ హితమైన వ్యవసాయ పద్ధతులు, పంటల మద్దతు ధర, వాటి సేకరణ అంశాలపై ఎక్కువ ప్రశ్నలు ఇచ్చారు. దీంతోపాటు ఈసారి ప్రశ్నలు ఎక్కువగా వినియోగ (అప్లికేషన్‌) సామర్థ్యాన్ని పరీక్షించేలా ఉన్నాయి. జనరల్‌ స్టడీస్‌ ప్రశ్నపత్రం కష్టంగా ఉందని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. గత మూడేళ్లుగా ప్రశ్నల సరళి విభిన్నంగా ఉంటోంది. కచ్చితంగా కొవిడ్‌-19పై ప్రశ్నలు వస్తాయని సన్నద్ధమైన అభ్యర్థులు.. దానిపై ఒక్కప్రశ్నా లేకపోవడంతో కొంత నిరాశ చెందారు.
ఈసారి తగ్గిన హాజరు
సివిల్స్‌ ప్రాథమిక పరీక్షకు సగం మందీ హాజరుకాలేదు. రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం నగరాల్లోని 68 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. 33,392 మంది దరఖాస్తు చేసుకున్నారు.
* కొవిడ్‌ నేపథ్యంలో పరీక్ష నిర్వహణకు అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. థర్మల్‌ స్కానింగ్‌ తర్వాతే కేంద్రాల్లోకి అనుమతించారు. ప్రతి అభ్యర్థి మాస్కు ధరించారు. శానిటైజర్‌ను వెంట తెచ్చుకున్నారు. గదులు, సీట్ల వివరాలు తెలిపేలా సైన్‌బోర్డులు ఏర్పాటుచేశారు.

Posted Date : 05-10-2020 .