• facebook
  • whatsapp
  • telegram

ఆర్జీయూకేటీలో ప్రవేశాలకు 40,158 దరఖాస్తులు

బాసర, న్యూస్‌టుడే: నిర్మల్‌ జిల్లా బాసర ఆర్జీయూకేటీ విద్యాలయంలో 2020-21 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు 40,158 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల గడువు అక్టోబరు 3తో ముగిసింది. తెలంగాణ నుంచి 37,155 మంది, ఏపీ నుంచి 2,963 మంది, ఇతర రాష్ట్రాల నుంచి 40 మంది దరఖాస్తు చేశారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను అక్టోబరు 20న ప్రకటిస్తారు.

Posted Date : 05-10-2020 .