• facebook
  • whatsapp
  • telegram

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదల

దిల్లీ: దేశవ్యాప్తంగా ఐఐటీల్లోని బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షల నిర్వహణ బాధ్యతలను తీసుకున్న దిల్లీ ఐఐటీ ఫలితాలను విడుదల చేసింది. అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో 43,204 మంది అర్హత సాధించగా.. చిరాగ్‌ ఫాలర్‌కు ప్రథమ ర్యాంకు వచ్చింది. గంగుల భువనరెడ్డి రెండో ర్యాంకు, బాలికల విభాగంలో కనిష్క మిట్టల్‌ ప్రథమ ర్యాంకు సాధించారు. ఓబీసీ విభాగంలో విజయవాడ విద్యార్థి జితేందర్‌కు తొలి ర్యాంకు వచ్చింది. ర్యాంకుల ఆధారంగా దేశంలోని 23 ఐఐటీల్లోని 13,600 సీట్లను భర్తీ చేయనున్నారు.  అక్టోబ‌రు 6 నుంచి నవంబరు 13 వరకు 6 విడతల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు.

Posted Date : 05-10-2020 .