• facebook
  • whatsapp
  • telegram

ఆన్‌లైన్‌ విద్యకు ప్రాధాన్యం

* తరగతులకు విద్యార్థుల హాజరుపై తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాల్సిందే

ఈనాడు, అమరావతి: కేంద్రం ప్రకటించిన అన్‌లాక్‌-5 మార్గదర్శకాలు రాష్ట్రానికి వర్తింపజేస్తూ వైద్య ఆరోగ్య శాఖ అక్టోబరు 5న ఉత్తర్వులు జారీ చేసింది. నవంబరు 2 నుంచి పాఠశాలలు, అక్టోబరు 15 నుంచి శిక్షణ సంస్థల్లో తరగతుల బోధన ప్రారంభంపై క్షేత్రస్థాయి పరిస్థితులు, యాజమాన్యాలతో చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. వీటి ప్రారంభంలో కొవిడ్‌-19 వ్యాప్తి నివారణ ముందస్తు చర్యలు పూర్తి స్థాయిలో తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. అక్టోబరు 31వ తేదీ వరకు ఈ మార్గదర్శకాలు అమల్లో ఉంటాయి. వీటిని అనుసరించి జిల్లాల కలెక్టర్లు, అధికారులు చర్యలు తీసుకోవాలి.
* ఆన్‌లైన్‌/దూరవిద్యా బోధనకు ప్రాధాన్యమివ్వాలి.
* పాఠశాలలు తెరిచిన అనంతరం ఆన్‌లైన్‌ తరగతులకు హాజరుకావడానికే విద్యార్థులు ప్రాధాన్యం ఇస్తే అనుమతి ఇవ్వాలి.
* తల్లిదండ్రుల లిఖితపూర్వక అనుమతితోనే విద్యార్థులు తరగతులకు హాజరయ్యేలా చూడాలి. హాజరు తప్పనిసరి చేయకూడదు.
* హోంశాఖ అనుమతి, క్షేత్రస్థాయి పరిస్థితులపై అంచనాకు వచ్చిన తరువాతే కళాశాలలు, ఉన్నత విద్యా సంస్థల పునఃప్రారంభ తేదీలపై నిర్ణయాలు తీసుకోవాలి.
 

Posted Date : 06-10-2020 .