• facebook
  • whatsapp
  • telegram

లాసెట్‌ ప్రాథమిక కీ తప్పిదాలపై ఫిర్యాదులు

ఎస్‌.కె.విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: లాసెట్‌ ప్రాథమిక కీ తప్పిదాలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో అక్టోబరు 1న ఏపీలాసెట్‌, పీజీఎల్‌సెట్‌-2020 పరీక్షలు నిర్వహించారు. రెండు పరీక్షలకు సంబంధించి ప్రాథమిక కీని అక్టోబరు 4న వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. కీలో పలు తప్పిదాలు ఉండటంతో అక్టోబరు 5 సాయంత్రం వరకు 150 ఫిర్యాదులు అందాయి. లాసెట్‌ కన్వీనరు ఆచార్య జ్యోతి విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. వచ్చిన ఫిర్యాదుల్లో ఏవి సరైనవో పరిశీలిస్తామన్నారు. అక్టోబరు 6న సాయంత్రం తుది కీని ఉన్నత విద్యామండలికి నివేదిస్తామని ఆయన పేర్కొన్నారు.

Posted Date : 06-10-2020 .