• facebook
  • whatsapp
  • telegram

విద్యార్థులకు జేఈఈ మెటీరియల్‌

ఈనాడు, అమరావతి: కరోనా కారణంగా ఇంటర్‌లో 30 శాతం పాఠ్యాంశాలను తగ్గిస్తూ పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కళాశాలల పని దినాలు తగ్గినందున ఈ మేరకు పాఠ్యాంశాలను తగ్గించినట్లు పేర్కొంది. సామాజికంగా, ఆర్థిక వెనుకబడిన విద్యార్థుల కోసం ఐఐటీ, జేఈఈ, ఎంసెట్‌, నీట్‌ మెటీరియల్‌ను సిద్ధం చేసి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ఇందుకోసం మొత్తం రూ.12.40 లక్షలు వ్యయం చేసినట్లు పేర్కొంది.

Posted Date : 06-10-2020 .