• facebook
  • whatsapp
  • telegram

దోస్త్‌ గడువు 9 వరకు పెంపు

ఈనాడు, హైదరాబాద్‌: దోస్త్‌ మూడో విడత రిజిస్ట్రేషన్‌ గడువు అక్టోబరు 6తో ముగియనుండగా దాన్ని 9వ తేదీ వరకు పొడిగించారు. వెబ్‌ ఆప్షన్ల గడువు 10వ తేదీ వరకు ఉంటుంది. సీట్లను 15వ తేదీన కేటాయిస్తారు. మూడో విడత పూర్తయిన తర్వాత ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ను దృష్టిలో పెట్టుకొని మరో విడత ప్రత్యేకంగా అవకాశం ఇస్తున్నామని కన్వీనర్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి తెలిపారు. అందుకు అక్టోబరు 15 నుంచి 26వ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని, 27వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చన్నారు. వారికి అక్టోబరు 30వ తేదీన సీట్లు కేటాయిస్తామని చెప్పారు.
6 నుంచి ఈసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌
ఈసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ అక్టోబరు 6 నుంచి మొదలుకానుంది. 6, 7 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. వారికి 9వ తేదీన సీట్లు కేటాయిస్తారు. 12వ తేదీ నుంచి తరగతులు మొదలవుతాయి.

Posted Date : 06-10-2020 .