• facebook
  • whatsapp
  • telegram

గ్రూప్‌-4 ఫలితాల విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) గ్రూప్‌ -4 ఫలితాలను  అక్టోబ‌రు 6న విడుదల చేసింది. 1595 ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను వెల్లడించింది. రెవెన్యూ, పంచాయతీరాజ్‌, వాణిజ్యపన్నులు, హోం, నీటిపారుదల, విపత్తు నిర్వహణ, అగ్నిమాపక, దళిత అభివృద్ధి, అటవీ, వైద్యఆరోగ్యం, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలకు చెందిన 1098 జూనియర్‌ అసిస్టెంటు, 450 టైపిస్టు, 44 స్టెనో(ఆంగ్లం), 3 స్టెనో(తెలుగు) పోస్టులు ఇందులో ఉన్నాయి. 2018లో వీటికి నోటిఫికేషన్‌ వెలువడగా నియామక ప్రక్రియ తాజాగా ముగిసింది. ఎంపికైన అభ్యర్థుల జాబితా కోసం https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావాలని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్‌ సూచించారు. కరోనా తీవ్రత ఉన్నా టీఎస్‌పీఎస్సీ సిబ్బంది ఆరు నెలలుగా ఎంతో ధైర్యంగా, కష్టపడి పనిచేసి గ్రూప్‌-4 పోస్టుల ఫలితాల వెల్లడికి సహకరించారని, ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి అభినందనలు తెలిపారు. తాజా ఫలితాలతో కలిసి టీఎస్‌పీఎస్సీ ద్వారా ఇప్పటి వరకు 30723 పోస్టులను భర్తీ చేసినట్లు ఆయన వెల్లడించారు. వైద్యఆరోగ్యశాఖ పోస్టులకు సంబంధించి న్యాయస్థానాల్లో పిటిషన్లు ఉండగా వాటికి ఇటీవల అనుమతులు లభించాయన్నారు. వైద్య ఆరోగ్యశాఖ నుంచి వివరణ వచ్చిన వెంటనే వీటి ఫలితాలను విడుదల చేస్తామని తెలిపారు.

Posted Date : 07-10-2020 .