• facebook
  • whatsapp
  • telegram

ఆధునిక సాంకేతికతపై ఇంజినీరింగ్‌ విద్యార్థులకు శిక్షణ

ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, పూర్తయిన వారికి మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న కోర్సులపై శిక్షణనిచ్చేందుకు ఎక్స్‌ఎల్‌ఆర్‌ సంస్థతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఎక్స్‌ఎల్‌ఆర్‌ సంస్థ డేటాఅనాలసిస్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, కృత్రిమ మేథస్సు, బిగ్‌డేటాలాంటి సాంకేతిక అంశాలపై విద్యార్థులు, అధ్యాపకులకు శిక్షణనిస్తుంది. ఇంజినీరింగ్‌ విద్యార్థులకు శిక్షణనిచ్చేందుకు ఎక్స్‌ఎల్‌ఆర్‌లాంటి సంస్థతో కలిసి పనిచేయడం సంతోషదాయకమని ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ, సీఈవో అర్జా శ్రీకాంత్‌ తెలిపారు.

Posted Date : 07-10-2020 .