• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ ఎంసెట్‌లో తొలి పది ర్యాంకులు అబ్బాయిలవే

* టాప్‌ టెన్‌లో అయిదుగురు ఏపీ విద్యార్థులు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌లో తొలి పది ర్యాంకులను అబ్బాయిలే కైవసం చేసుకున్నారు. వారిలో సగం మంది ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు కాగా మిగిలిన సగం మంది తెలంగాణ వారు. ఎంసెట్‌ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  అక్టోబ‌రు 6న విడుదల చేశారు. మొదటి ర్యాంకర్‌ సాయితేజకు 160కి 147.2905 మార్కులు వచ్చాయి. ఆన్‌లైన్‌లో ఎనిమిది విడతల్లో పరీక్ష జరపడంతో నార్మలైజ్‌డ్‌ ర్యాంకింగ్‌ విధానం అమలు చేసి పాయింట్లు ఇచ్చారు. పదో ర్యాంకర్‌కు 137.2910 మార్కులొచ్చాయి.

Posted Date : 10-08-2020 .