• facebook
  • whatsapp
  • telegram

‘జోసా’ కౌన్సెలింగ్‌లో 50,798 సీట్లు

* ఐఐటీల్లో 16,053.. ఎన్‌ఐటీల్లో 23,506

ఈనాడు, హైదరాబాద్‌: జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ(జోసా) ఈ సారి దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యాసంస్థల్లో మొత్తం 50,798 సీట్లను కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేయనుంది. అందులో ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో 2,673 సీట్లు ప్రత్యేకంగా అమ్మాయిలకు సూపర్‌ న్యూమరరీ కోటా కింద కేటాయించారు. ఈ సారి 23 ఐఐటీల్లోని 16,053 సీట్లు, 31 ఎన్‌ఐటీల్లోని 23,506 సీట్లు, 26 ట్రిపుల్‌ఐటీల సీట్లను కలుపుకొని మొత్తం 101 విద్యాసంస్థల్లో సీట్లను జోసా ద్వారా భర్తీ చేస్తున్నారు. మొదటి విడత సీట్లను అక్టోబ‌రు 17వ తేదీన కేటాయించనున్నారు.

Posted Date : 08-10-2020 .