• facebook
  • whatsapp
  • telegram

11న మహిళా వర్సిటీ పీజీసెట్‌ - 2020

మహిళా వర్సిటీ(తిరుపతి), న్యూస్‌టుడే: శ్రీపద్మావతీ మహిళా వర్సిటీ(ఎస్పీఎంవీవీ) పీజీసెట్‌-2020 ప్రవేశ పరీక్షను రెండు తెలుగు రాష్ట్రాల్లో  అక్టోబరు 11న మొత్తం 5 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు అడ్మిషన్స్‌ సంచాలకులు ఆచార్య సువర్ణలతాదేవి తెలిపారు. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల నుంచి మొత్తం 3,178 మంది పరీక్షకు హాజరుకానున్నట్లు వెల్లడించారు. తిరుపతి శ్రీపద్మావతీ మహిళా విశ్వవిద్యాలయంతోపాటు కర్నూలు, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్టణం కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష జరుగుతుందని చెప్పారు. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, ఒంగోలు జిల్లాల నుంచి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మహిళా వర్సిటీ కేంద్రంలోనే పరీక్ష రాస్తారని పేర్కొన్నారు.

Posted Date : 09-10-2020 .