• facebook
  • whatsapp
  • telegram

సివిల్‌ సర్వీసెస్‌ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

ఈనాడు, హైదరాబాద్‌: సివిల్‌ సర్వీసెస్‌ శిక్షణకు ఆసక్తి కలిగిన మైనార్టీ అభ్యర్థులు అక్టోబరు 15లోగా దరఖాస్తు చేసుకోవాలని మైనార్టీ సంక్షేమ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దరఖాస్తు చేసిన అభ్యర్థులకు అక్టోబరు 23న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జిల్లా కేంద్రాల్లో ప్రవేశపరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది. వివరాలకు 040-23236112 నంబర్లో సంప్రదించాలని సూచించింది.

Posted Date : 09-10-2020 .