• facebook
  • whatsapp
  • telegram

మహిళా వర్సిటీ పీజీసెట్‌లో వెసులుబాటు

* ఉదయం పరీక్షను మధ్యాహ్నం రాయొచ్చు

మహిళా వర్సిటీ(తిరుపతి), న్యూస్‌టుడే: శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ పీజీసెట్‌-2020 అక్టోబ‌రు 11న జరగనుందని రెక్టార్‌ ఆచార్య సంధ్యారాణి తెలిపారు. అదే రోజు ఇతర వర్సిటీల ప్రవేశ పరీక్షలూ ఉండటంతో విద్యార్థినులు మధ్యాహ్నం సెషన్‌లో వచ్చి రాయవచ్చని వెసులుబాటు ఇచ్చారు. మధ్యాహ్నం 12నుంచి 1.30గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. మహిళా వర్సిటీలో ఉదయం పరీక్షను మధ్యాహ్నం రాయాలనుకునే అభ్యర్థులు ముందుగా అడ్మిషన్స్‌ సంచాలకుల వద్ద అనుమతి తీసుకోవాలన్నారు. పూర్తి వివరాలు అడ్మిషన్స్‌ వెబ్‌సైట్‌లో లేదా 0877 2284592కు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు.

Posted Date : 09-10-2020 .