• facebook
  • whatsapp
  • telegram

నేడు ఏపీ ఎంసెట్‌ ఫలితాలు

ఈనాడు, అమరావతి: ఏపీ ఎంసెట్‌ ఫలితాలను విజయవాడలో అక్టోబరు 10న ఉదయం 10 గంటలకు మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేయనున్నారు. ఇంజినీరింగ్‌ పరీక్షకు 1,56,899 మంది హాజరు కాగా.. వ్యవసాయ, ఫార్మసీ పరీక్షలను 75,834 మంది రాశారు. కరోనా పాజిటివ్‌ కారణంగా పరీక్షకు హాజరు కాలేకపోయిన 97 మందికి అక్టోబరు 7న పరీక్ష నిర్వహించారు. ఇంటర్మీడియట్‌ మార్చి పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి మొదట ర్యాంకులు విడుదల చేయనున్నారు. ఫలితాలు ‌www.eenadu.net, www.eenadupratibha.net  వెబ్‌సైట్‌ల్లో అందుబాటులో ఉంటాయి.

Posted Date : 10-10-2020 .