• facebook
  • whatsapp
  • telegram

క్లాట్‌ కౌన్సెలింగ్‌కు 10,393 మంది హాజరు

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా న్యాయ విశ్వవిద్యాలయాల్లో యూజీ, పీజీ సీట్ల భర్తీకి అక్టోబరు 9న నిర్వహించిన కౌన్సెలింగ్‌కు మొత్తం 10,393 మంది హాజరయ్యారు. యూజీలో 14,992 మందికి 8,227 మంది, పీజీలో 4,081కి 2,166 మంది మాత్రమే కౌన్సెలింగ్‌ ఫీజు చెల్లించి సీట్లకు పోటీపడేందుకు అర్హులయ్యారు. యూజీలో 2,596, పీజీలో 783 సీట్లు అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా అక్టోబరు 9 సాయంత్రానికి 2,786 మంది ఆయా కళాశాలల్లో ప్రవేశాలు తీసుకున్నారు. క్లాట్‌ ర్యాంకులతోనే హైదరాబాద్‌లోని నల్సార్‌, విశాఖపట్టణంలోని అంబేడ్కర్‌ న్యాయ విశ్వవిద్యాలయంలో సీట్లను భర్తీ చేస్తారు.

Posted Date : 10-10-2020 .