• facebook
  • whatsapp
  • telegram

పాలిటెక్నిక్‌ కళాశాలల అనుమతుల పునరుద్ధరణ

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో అదనపు కోర్సులు, సీట్ల పెంపు, అనుమతులను పునరుద్ధరిస్తూ నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము ఉత్తర్వులిచ్చారు. 185 ప్రైవేటు కళాశాలలకు అనుమతుల పునరుద్ధరణ, కొన్ని కళాశాలలకు సీట్ల పెంపు, అదనపు కోర్సుల నిర్వహణకు ఆమోదం తెలిపారు. 84 ప్రభుత్వ కళాశాలల్లో అదనపు కోర్సులు ప్రవేశపెట్టేందుకు అనుమతించారు. 33 డీఫార్మసీ కళాశాలలకు అనుమతులు పునరుద్ధరించారు.

Posted Date : 10-10-2020 .