• facebook
  • whatsapp
  • telegram

పీఈసెట్‌కు పెరిగిన పోటీ

ఈనాడు, హైదరాబాద్‌: ఈసారి వ్యాయాయ విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించనున్న తెలంగాణ పీఈసెట్‌కు దరఖాస్తులు పెరిగాయి. గత ఏడాది 5678 మంది పోటీపడగా ఈసారి ఆ సంఖ్య 7,474కు పెరిగింది. అంటే 24 శాతం దరఖాస్తులు పెరిగాయని కన్వీనర్‌ ఆచార్య పి.సత్యనారాయణ తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే వారిలో 2292 మంది అమ్మాయిలున్నారని చెప్పారు. గ్రామస్థాయిలో కూడా అవగాహన పెంచడంతో పోటీపడే వారి సంఖ్య పెరిగిందని ఆయన తెలిపారు.

Posted Date : 10-10-2020 .