• facebook
  • whatsapp
  • telegram

ఈసెట్‌ చివరి దశ సీట్ల కేటాయింపు

ఈనాడు, హైదరాబాద్‌: పాలిటెక్నిక్‌ విద్యార్థులు నేరుగా బీటెక్‌,బీఫార్మసీ రెండో ఏడాదిలో చేరేందుకు ఈసెట్‌ చివరి విడత సీట్లను అక్టోబరు 9న కేటాయించారు. చివరి విడతలో 2,505 మందికి సీట్లు దక్కాయి. మొత్తం విడతల్లో 9,209 మందికి సీట్లు లభించగా...ఇంకా ఇంజినీరింగ్‌లో 189, ఫార్మసీలో 1020 సీట్లు మిగిలిపోయాయి. సీట్లు పొందిన వారు అక్టోబరు 12వ తేదీలోపు రుసుం చెల్లించి సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలి.

Posted Date : 10-10-2020 .