• facebook
  • whatsapp
  • telegram

10 వరకు దోస్త్‌ రిజిస్ట్రేషన్‌ గడువు పొడిగింపు

ఈనాడు, హైదరాబాద్‌: దోస్త్‌ ద్వారా డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు మూడో విడత రిజిస్ట్రేషన్‌ గడువును అక్టోబరు 10 వరకు పొడిగించినట్లు కన్వీనర్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి తెలిపారు. ఇప్పటివరకు మూడో విడతలో 29,971 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. గతంలో సీట్లు పొందిన వారితో కలిపి మొత్తం 67,082 మంది వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్నారని, సీట్లను అక్టోబరు 15న కేటాయిస్తామని ఆయన తెలిపారు.

Posted Date : 10-10-2020 .