• facebook
  • whatsapp
  • telegram

ఏపీ ఎంసెట్‌లో మెరిసిన తెలంగాణ విద్యార్థులు  

* ఇంజినీరింగ్‌ తొలి పది ర్యాంకుల్లో ఐదుగురు వారే
* వ్యవసాయ విభాగం మొదటి పది మందిలో ఇద్దరు

ఈనాడు, ఈనాడు డిజిటల్‌- అమరావతి: ఏపీ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌, వ్యవసాయ విభాగంలో తెలంగాణ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఇంజినీరింగ్‌లో తొలి 10 ర్యాంకుల్లో ఐదుగురు, వ్యవసాయ విభాగం మొదటి 10 మందిలో ఇద్దరు మన విద్యార్థులు ఉన్నారు. ఏపీ ఎంసెట్‌-2020 ఫలితాలను మంత్రి సురేష్‌ విజయవాడలో అక్టోబ‌రు 10న విడుదల చేశారు. ఇంజినీరింగ్‌లో 84.78 శాతం, వ్యవసాయంలో 91.77 శాతం మంది అర్హత సాధించారు. జేఈఈ అడ్వాన్సుడ్‌లో 173వ ర్యాంకర్‌ సాయినాథ్‌ ఎంసెట్‌లో మొదటి ర్యాంకు సాధించారు. 2, 14 ర్యాంకర్లు గంగుల భువన్‌రెడ్డి, లండ జితేంద్ర ఎంసెట్‌లో 3, 10 ర్యాంకులు పొందారు. తెలంగాణకు చెందిన కుమార్‌సత్యం ఎంసెట్‌లో రెండో ర్యాంకు కైవసం చేసుకున్నారు. అక్టోబ‌రు 14 నుంచి ఎంసెట్‌ ర్యాంకు కార్డులను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

క్లిష్టమైన అంశాలపై దృష్టి
నిత్యం 10 గంటలు చదివా. క్లిష్టమైన అంశాలకు ఎక్కువ సమయం కేటాయించా. మా నాన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఇంటర్‌ చదివేందుకు హైదరాబాద్‌ వచ్చా.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 22వ ర్యాంకు వచ్చింది. ఐఐటీ బాంబేలో కంప్యూటర్‌ సైన్స్‌లో చేరతా.   
- కుమార్‌ సత్యం, దిల్లీ (రెండో ర్యాంకు)


మాదిరి పరీక్షలతో పట్టు
నాన్న నీలకంఠరెడ్డి ఇరిసెట్‌లో సీనియర్‌ ప్రొఫెసర్‌. అమ్మ శ్రీలత టీఎస్‌ ట్రాన్స్‌కోలో ఉద్యోగి. కళాశాలలో మాదిరి పరీక్షలు రాయడంతో ర్యాంకులు సాధ్యమయ్యాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 327, టీఎస్‌ ఎంసెట్‌లోనూ నాలుగో ర్యాంకు వచ్చింది. అంకుర సంస్థను స్థాపిస్తా.               
- కౌశల్‌కుమార్‌రెడ్డి, సికింద్రాబాద్‌ (అయిదో ర్యాంకు)

 

Posted Date : 11-10-2020 .