• facebook
  • whatsapp
  • telegram

ఆలిండియా నం.1గా నిమ్స్ వైద్యుడు‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: జాతీయ వైద్యవిద్య ప్రవేశపరీక్ష ‘నీట్ సూప‌ర్‌స్పెషాలిటీ-2020’లో నగరానికి చెందిన యువ వైద్యుడు డాక్టర్‌ దావలూరి అనుదీప్‌ ఆలిండియా మొదటి ర్యాంకును సొంతం చేసుకున్నారు. అనుదీప్‌ నిమ్స్‌లో జనరల్‌ మెడిసిన్‌లో ఎండీ కోర్సు పూర్తిచేస్తూనే సెప్టెంబ‌రులో నీట్‌ రాశారు. అనుదీప్‌ సొంతూరు గుంటూరు జిల్లా. తల్లిదండ్రులు వ్యాపారరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. గాంధీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ చేశారు. ఇప్పుడు నిమ్స్‌లో జనరల్‌ మెడిసిన్‌ ఎండీ కోర్సు పూర్తి కాగానే పరిశోధనలపై ఉన్న ఆసక్తితో తిరిగి ఈ ఏడాది నీట్‌ సూపర్‌స్పెషాలిటీ రాసి అందులో జాతీయస్థాయిలో రాణించారు.

Posted Date : 11-10-2020 .