• facebook
  • whatsapp
  • telegram

ముగిసిన‌ మహిళా వర్సిటీ పీజీసెట్‌  

మహిళా వర్సిటీ(తిరుపతి), న్యూస్‌టుడే: రెండు తెలుగు రాష్ట్రాల్లో  అక్టోబ‌రు 11న‌ నిర్వహించిన శ్రీ పద్మావతీ మహిళా వర్సిటీ పీజీసెట్‌-2020 ముగిసింది. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా తిరుపతిలోని మహిళా వర్సిటీ కేంద్రంతో పాటు కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌ కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం పరీక్ష నిర్వహించారు.  పరీక్షకు  75 శాతం విద్యార్థినులు హాజరయ్యారని అడ్మిషన్స్‌ సంచాలకులు ఆచార్య సువర్ణలతాదేవి తెలిపారు. వర్సిటీ ఇచ్చిన వెసులుబాటుతో ఉదయం వేరే సెట్‌ రాసిన 35 మంది విద్యార్థులు మధ్యాహ్నం ఈ పరీక్షకు హాజరయ్యారు.


 

Posted Date : 12-10-2020 .