• facebook
  • whatsapp
  • telegram

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు

వెల్లడించిన ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిత్తల్ 

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా 12న‌ జరగాల్సిన వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియను అధికారులు వాయిదా వేశారు. ఇంజినీరింగ్‌లో కొత్త కోర్సులు, కళాశాలల అనుబంధ గుర్తింపు ప్రక్రియ కొలిక్కి రాకపోవడంతో కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. 12 నుంచి 20వ తేదీ వరకు జరగాల్సిన వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియను నాలుగు రోజులకు కుదించి అక్టోబ‌రు 18 నుంచి 22వ తేదీల మధ్య చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇంజినీరింగ్ మొదటి విడత సీట్లను అక్టోబ‌రు 22వ తేదీన కేటాయించాలని గతంలో నిర్ణయించినప్పటికీ తాజా మార్పుల నేపథ్యంలో అక్టోబ‌రు 24న కేటాయించనున్నట్లు వివరించారు.
 

ధ్రువపత్రాల పరిశీలన మాత్రం యథాతథంగా కొనసాగునున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 36 సహాయ కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన జరగనున్నట్లు చెప్పారు. ఇందుకోసం ఇప్పటి వరకు 35,824 మంది స్లాట్ బుక్ చేసుకున్నట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9 వేల మంది ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకానున్నట్లు కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ తెలిపారు.

Posted Date : 12-10-2020 .