నవంబరు 2 నుంచి గ్రూపు -1 ప్రధాన పరీక్షలు   

* అక్టోబ‌రు 19 నుంచి వెబ్‌సైట్లో  హాల్‌టికెట్లు
ఈనాడు, అమరావతి: ఏపీపీఎస్సీ గ్రూపు-1 ప్రధాన పరీక్షలను  నవంబరు 2 నుంచి 13వ తేదీల మధ్య నిర్వ‌హించ‌నున్నట్లు తెలిపింది.  అభ్యర్థులు అక్టోబ‌రు 19 నుంచి హాల్‌టికెట్లను కమిషన్‌ వెబ్‌సైట్‌ ద్వారా పొందవచ్చని ఓ ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్‌తో పాటు 13 జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ప్రశ్నపత్రాన్ని తెలుగు/ఆంగ్లంలో అభ్యర్థులకు ట్యాబ్‌(ఎలక్ట్రానిక్‌ డివైస్‌) ద్వారా అందజేస్తామని తెలిపింది. మరోవైపు ప్రిలిమినరీ తుది ‘కీ’లో తప్పులపై హైకోర్టు తీర్పు వచ్చాకే మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు.
 

Posted Date : 13-10-2020 .