• facebook
  • whatsapp
  • telegram

టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌ ఫలితాలు విడుద‌ల‌

ఈనాడు, హైదరాబాద్‌: పాఠశాల విద్యాశాఖ పరిధిలో తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని 35 గురుకుల జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌ ప్రవేశాల కోసం అక్టోబ‌రు 4వ తేదీన‌ నిర్వహించిన టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌ ఫలితాలను అక్టోబ‌రు 13న‌ విడుదల చేసినట్లు కార్యదర్శి ఎస్‌.వెంకటేశ్వర శర్మ తెలిపారు. ఫలితాలను http://tsrjc.cgg.gov.in/ ద్వారా తెలుసుకోవచ్చన్నారు.  కళాశాలల్లో ప్రథమ సంవత్సరంలో 3 వేల సీట్లుండగా ఎంపీసీ 1500, బైపీసీ 1440, ఎంఈసీ 60 సీట్లున్నాయని తెలిపారు. ఎంపీసీ సీట్ల భర్తీకి అక్టోబ‌రు 19న, బైపీసీ,ఎంఈసీ సీట్ల భర్తీకి 20వ తేదీన బాలబాలికలకు వేర్వేరుగా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని శర్మ చెప్పారు. అర్హులైన విద్యార్థులకు కౌన్సెలింగ్‌ జరిగే కళాశాలల వివరాలు వారి ఫోన్లకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలియజేశామన్నారు.

Posted Date : 14-10-2020 .