• facebook
  • whatsapp
  • telegram

2021లో ప‌రీక్ష రాసేందుకు అవ‌కాశం

దిల్లీ: జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2020 ప‌రీక్ష‌కు రిజిష్ట‌ర్ చేసుకుని క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా విధించిన ఆంక్ష‌ల వ‌ల్ల హాజ‌రు కాని విద్యార్థుల‌కు 2021లో నేరుగా ప‌రీక్ష రాసేందుకు అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్లు జాయింట్ అడ్మిష‌న్ బోర్డు (జేఏబీ) ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు అక్టోబ‌రు 13న జ‌రిగిన జేఏబీ బోర్డు స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు దిల్లీ ఐఐటీ డైరెక్ట‌ర్ వి.రాంగోపాల్ రావు తెలిపారు. ఇందుకోసం విద్యార్థులు జేఈఈ(మెయిన్‌) 2021లో అర్హ‌త సాధించాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొన్నారు. 2020 నాటి అర్హ‌త ప్ర‌కార‌మే నేరుగా అడ్వాన్స్‌డ్  రాసేందుకు అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్లు దిల్లీ ఐఐటీ పేర్కొంది.

Posted Date : 14-10-2020 .