• facebook
  • whatsapp
  • telegram

కేఆర్‌యూ సెట్‌-2020 ఫలితాల విడుదల

కృష్ణావిశ్వవిద్యాలయం: కృష్ణా విశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలల్లో పీజీ కోర్సుల ప్రవేశానికి నిర్వహించిన కేఆర్‌యూ సెట్‌-2020 పరీక్షల ఫలితాలను విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె.బి.చంద్రశేఖర్‌ అక్టోబ‌రు 14న‌ విడుదల చేశారు. విశ్వవిద్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మొత్తం 2,808 మంది విద్యార్థులు సెట్‌కు దరఖాస్తు చేసుకోగా 2,468 మంది పరీక్షలకు హాజరయ్యారన్నారు. వీరిలో లైఫ్‌సైన్స్‌ విభాగంలో కనుమూరి సాయివికాస్‌, మేథమేటికల్‌ సైన్స్‌ విభాగంలో మోదుగుమూడి సంధ్యారాణి, ఫిజికల్‌ సైన్స్‌లో మిద్దే రాఘవమ్మ, కెమికల్‌ సైన్స్‌లో మోకా నరేంద్ర, హ్యూమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్స్‌లో గుర్రంకొండ గాయత్రి, ఇంగ్లీష్‌లో చారీస్‌ ఇవాంజిలీన్‌, తెలుగులో కూరాకుల దుర్గాభవాని మొదటి ర్యాంకు సాధించారని తెలిపారు.

Posted Date : 15-10-2020 .